జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి
ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ
తేదీ:-16-07-2025
విజయవాడ.
ఈరోజు టీబి ముక్త భారత్ అభియాన్ లో భాగంగా జిల్లాలో జరుగుతున్న టీబి వ్యాధి పట్ల, ప్రజల్లో అవగాహన కల్పించుట, వ్యాధి నిర్ధారణ చర్యలు, వ్యాధిని పడ్డ వారికి ఉచితంగా ఇచ్చు మందులు, మరియు ఈ వ్యాధి, రాకుండా తీసుకొను, ముందస్తు చర్యలను, జాగ్రత్తలను, అవగాహన కార్యక్రమాలను, పరిశీలించుటకు, కేంద్ర ప్రభుత్వం టీబి డివిజన్ కు సంబంధించిన, CTD ( Central TB division ) బృంద సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సందర్శించడం జరిగింది.
ఈ సందర్శనలో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం--- ఏపీఐఐసీ కాలనీ సందర్శించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న టీబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమమును నిశితంగా పరిశీలించి, తగిన సూచనలు సలహాలు అచటి వైద్యాధికారికి ఇవ్వటం జరిగినది.
తదుపరి సిద్ధార్థ వైద్య కళాశాలలోని CDST -TB-LAB ను సందర్శించి అక్కడ లేబరేటరీ లో జరుగుతున్న పరీక్షలను పరిశీలించడం జరిగినది.
ఈ కేంద్ర బృంద సభ్యులలో డాక్టర్ భావనీసింగ్ కుశ్వహ, టీబి ఆఫీసర్ CTD–MOHFW, మిస్టర్ D. ధర్మారావు, మిస్టర్ గంగాధర్ దాస్, మరియు JD రమేష్ ని, –జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారినిణి వారు, పుష్పగుచ్చంతో ఆహ్వానించి, వారితో కలిసి కార్యక్రమాల పరిశీలనకు వెళ్లడం జరిగినది.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం., ఎన్టీఆర్ జిల్లా., విజయవాడ.