టీడీపీ నేత రామకృష్ణ మృతికి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం

Spread the love

టీడీపీ నేత రామకృష్ణ మృతికి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం

అమరావతి ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నె రామకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామకృష్ణ హఠాన్మరణం తనను షాక్ కు గురిచేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ ఎంతో క్రియాశీలకంగా, సమర్థవంతంగా పనిచేశారని అన్నారు. ఓటర్ వెరిఫికేషన్ లో మంచి అనుభవం ఉన్న రామకృష్ణను అంతా ఓటర్ రామకృష్ణగా పిలిచేవారని అన్నారు. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *