టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం) టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశ వివరాలు

Spread the love

 30.06.2024 (మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం) టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశ వివరాలు

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని గ్రివెన్స్ లో తమ కష్టాలను చెప్పుకునేందుకు భార్య భర్తలు ప్రీతమ్, గాయిత్రిలు తమ బిడ్డతో రాజమండ్రి నుండి వచ్చారు. వారి కూతరు తొమ్మినెలల చిన్నారి హితేసి ఒక అరుదైన ప్రాణాంతకర వ్యాధి( SMA స్పైనల్ మస్కులర్ ఎట్రాఫి టైప్ 1)తో బాధపడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ.. పాప ట్రీట్ మెంట్ కు దాదాపు రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని.. దానికోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజలు, ఎన్నారైలు, బిజినెస్ హోల్డర్లు, స్వచ్ఛంద సంస్థలు ముందకు వచ్చి సహాయం చేయాలని పల్లా శ్రీనివాసరావు కోరారు. అంతే కాక ప్రభుత్వం తరుఫున, టీడీపీ తరఫున సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రౌడ్ ఫండింగ్ కోసం హాస్పటల్ తో లింక్ అయిన ఇంప్యాక్ట్ గురు అనే సంస్థ అకౌంట్ కు డబ్బులు పంపిస్తే నేరుగా ఆసుపత్రికి ఆ డబ్బులు చేరి పాపకు ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. WWW. IMPACT. COMలోకి వెళ్లి హితేసి అనే లింక్ పై క్లిక్ చేస్తే పాప అకౌంట్ కు సంబంధించిన వివరాలు వస్తాయన్నారు. కావున రాష్ట్ర ప్రజలు సహృదయంతో సాయం చేసి పాప అకౌంట్ లో డబ్బులు వేసి పాప ప్రాణాలు నిలపాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కోరారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *