టిడిపి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు
.
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఆ చట్టం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నానిఅన్నారు.
_జగ్గయ్యపేట నియోజకవర్గం, నందిగామ మండలం గోళ్ళమూడి, రుద్రవరం,మాగల్లు గ్రామాలలో గురువారం రాత్రి ఎంపీ కేశినేని నాని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ జగన్ ఏది చేసినా అది ప్రజా ప్రయోజనాల కోసమేనన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్సార్ సిపి కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను చేసి చూపించారన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈ కేవలం ఈ ఐదు సంవత్సరాలలో జరిగాయన్నారు.
ప్రజలంతా వైయస్సార్ సిపి వైపే: ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను
రాష్ట్రంలో ప్రజలంతా వైయస్సార్ సిపి వైపే ఉన్నారని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రతి పేదవారు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ఎంతోమందిని అభివృద్ధి బాటలో నడిపించాయన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సైతం పథకాల ద్వారా లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాల వారు ఆర్థికంగా స్థిరపడ్డారన్నారు. ఈనెల 13న జరగబోయే ఎన్నికలలో కూడా మరో మారు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి జగ్గయ్యపేట గెలుపును ముఖ్యమంత్రికి గిఫ్టుగా అందజేసే బాధ్యత ప్రజలదేనన్నారు
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు