31-07-2025
టిడిపి ఎంపీలతో కలిసి కేంద్రమంత్రుల్ని కలిసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ఢిల్లీ : హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం పార్లమెంట్ లో ఎంపీ కేశినేని శివనాథ్, ఇతర టిడిపి ఎంపీలతో కలిసి పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లను కలిసి హిందూపురం నియోజవకర్గం అభివృద్దికి తోడ్పాటు అందించాల్సిందిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు వినతి పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ లావుకృష్ణదేవరాయులు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు,ఎం.పి ఎం.శ్రీభరత్, ఎంపీ హరీష్ మాధుర్, ఎంపీ తెన్నేటి ప్రసాద్,ఎంపీ బీకే పార్థసారథి, ఎంపీ లక్ష్మీనారాయణ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.