జూలై ఒకటో తేదీన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు వివరించారు.

Spread the love

 యన్టిఆర్ జిల్లా,27.06.2024.

              

 జూలై ఒకటో తేదీన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు వివరించారు.

జూలై ఒకటవ తేదీ నుండి పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 నగరంలోని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జి. సృజన మాట్లాడుతూ. జిల్లాలో మొత్తం 2,35,477 మంది పింఛ‌నుదారుల‌కు రూ. 160.53 కోట్ల మొత్తాన్ని అందించ‌నున్న‌ట్లు తెలిపారు. 

 జులై ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షనర్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అదే

 రోజు పూర్తిస్థాయిలో పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే రోజు పింఛన్ల పంపిణీని పూర్తి చేసేలా స్పష్టంగా తెలుపామన్నారు. ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాలు చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరం అయితే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు

మొత్తం నాలుగు రకాల క్యాటగిరీల పింఛనుదారులలో, 11 సబ్ క్యాటగిరీలకు చెందిన పెన్షన్ దారులకు మొత్తం రూ.7000/- అనగా జులై మాసానికి సంబంధించి రూ.4000/- మరియు ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబంధించి నెలకు ₹1000 చొప్పున ఏరియర్స్ మొత్తంగా రూ.3000/- పంపిణీ చేయాలని మరియు మిగిలిన క్యాటగిరీలకు ప్రస్తుత ప్రభుత్వం పెంచిన విధంగానే నగదును పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *