జూన్ నెల 12 వతేది నుంచి లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందించనున్న పేదల మంచి కోరే మనందరి మంచి ప్రభుత్వం MLA బొండా ఉమ

1
0

 జూన్ నెల 12 వతేది నుంచి లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందించనున్న పేదల మంచి కోరే మనందరి మంచి ప్రభుత్వం  MLA బొండా ఉమ

ధి15-5-2025 గురువారం సాయంత్రం 6:30″గం లకు ” 60 డివిజన్ వాంబే కాలనీ కళ్యాణ మండపం నందు కార్పొరేటర్ కంచి దుర్గ, కంచి ధన శేఖర్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటుచేసి మహిళలకు చీర పసుపు కుంకుమ అందచేయడమైనది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున  అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది

ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ :-గర్భిణీ మహిళలు పండంటి బిడ్డ కు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేవరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది, మహిళలకు ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాల మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తా ఉన్నామని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3000 పెంచిన 4000 చేసాం అలాగే మూడు సిలిండర్లని మహిళలకు దీపం 2 పథకం ద్వారా ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని

పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లు పెట్టి రోజుకు ₹15 రూపాయల తో కడుపు నింపుతున్నామని, అంతేకాకుండా అమ్మఒడి గతంలో ఒక బిడ్డకు ఇచ్చేవాళ్ళు అని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లికి వందనం కింద ఇద్దరు పిల్లలు ఉంటే ₹30000 ముగ్గురు పిల్లలు ఉంటే ₹45 వేల రూపాయలు కూడా ఈ నెల నుంచి అందించనున్నామని

మహిళలకు సంవత్సరానికి ₹18000 ఇస్తామని చెప్పి మాటిచ్చాం దాని ప్రకారం రేపు జూన్ నెల నుంచి 18 వేల రూపాయలు అందించనున్నామని, అంతేకాకుండా మహిళలు అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిన మాట ప్రకారం బస్ ప్రయాణం కూడా త్వరలో ప్రారంభించనున్నామని

మేనిఫెస్టోలో లేని పథకాన్ని కూడా తీసుకొని వచ్చి మహిళలకు  కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేసి వారి కాళీ మీద వారు నుంచునే విధంగా ఉచితంగా శిక్షణను అందించి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందిస్తున్నామని

డివిజన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ  మా చెల్లెలు అందరికీ కూడా శ్రీమంతం కార్యక్రమం అంగన్వాడి టీచర్ల ద్వారా ప్రభుత్వపరంగా గర్భిణీ అక్క, చెల్లెమ్మలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి,  ఇవాళ గర్భం ధరించినటువంటి ఆడపడుచుకి పౌష్టికాహార ఇవ్వటం గాని గుడ్లు పాలు మరి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వ బాధ్యత తీసుకొని అంగన్వాడి వ్యవస్థ ద్వారా అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు ద్వారా భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా కొనసాగిస్తామని

డెలివరీ అయినాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ అయినాక అక్కడ కూడా నమోదు చేసి బేబీ కిడ్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్, బేబీ కిట్‌లో దోమతెర, పరువు, వాటర్‌ప్రూఫ్ బెడ్‌షీట్, డ్రెస్, వాషబుల్ నేప్కిన్స్, టవల్, పౌడర్, షాంపూ, ఆయిల్, సోప్, రాటిల్ టాయ్ కూడా అందించనున్నామని తెలియజేశారు

 ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బేవర సూరి, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, ఇన్చార్జి M. మల్లేశ్వరరావు, బుగత శ్రీరాములు,ధర్మాన రాము, SK సుభాని, డివిజన్ మహిళా అధ్యక్షురాలు మైనంపాటి సుబ్బలక్ష్మి, దుర్గ, సావిత్రి, దేవమని, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here