జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…

Spread the love

విజయవాడ

పున్నమీ ఘాట్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…

• జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం
• జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి విజయవాడలో కొందరు వీధి వ్యాపారులు, దుకాణాలను సందర్శించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను
• ఓటు అనే ఆయుధంతో చీకటి పాలనను ప్రజలు తరిమేశారు
• రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుడిని ప్రజలు ఓడించారు.
• టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని 94 శాతం స్ట్రైక్ రేట్ తో ప్రజలు గెలిపించారు.
• రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠపాళి వద్దు.
• వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణం పోసింది
• 16 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాం
• సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాం
• ఒక డీఏ ఉద్యోగులకు, పోలీసులకు ఒక సరెండర్ లీవ్‌ను మంజూరు చేశాం
• త్వరలోనే ఈహెచ్‌ఎస్‌ను కూడా గాడిలో పెడతాం
• ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాము
• జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ప్రయోజనాలు కలుగుతున్నాయి
• జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతోంది
• అమరావతి నిర్మాణం కూడా వేగంగా చేపడుతున్నాం
• ప్రతీ ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలి
• ఏపీ ఇక ఏఐగా మారాలి
• విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇతర దేశాలకు సేవలు అందుతాయి
• 2027 డిసెంబర్ కు పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం
• పీ4 అనుసంధానం ద్వారా పేదలకు చేయూత ఇచ్చి జీవన ప్రమాణాలను పెంచుతాం
• 2047 నాటికి భారత్ ప్రపంచలో నెంబర్ వన్ గా మారుతుంది. అందులో స్వర్ణాంధ్ర కూడా అగ్రస్థానంలో ఉంటుంది
• తద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా పెరుగుతుంది.
• ఏపీకి కావాల్సింది సుస్థిరమైన పాలనే.
• రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *