జిల్లా కలెక్టర్ల సమావేశంలో . కొణిదెల పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామాత్యులు

Spread the love

05.08.2024

అమరావతి

జిల్లా కలెక్టర్ల సమావేశంలో  . కొణిదెల పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామాత్యులు

ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించాం. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులను సైతం గత ప్రభుత్వం అవమానించింది. 

వ్యవస్థలను బలోపేతం చేయడంకోసం దెబ్బలు తిన్నాం, భరించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏనాడూ ఇటువంటి ఇబ్బందులు పడలేదు. 

మా కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అధికారం కట్టబెట్టారు. 164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో, మంచి ఓటింగ్ శాతంతో చారిత్రాత్మక విజయం సాధించాం

వ్యవస్థలను బ్రతికించాలని, వ్యవస్థలను బలోపేతం చేయాలని మేం అధికారంలోకి వచ్చాం. 

ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడాం. గెలిచాం.

మంచి పాలన అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. మీ సూచనలు చాలా ముఖ్యం..

రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. 

రాష్ట్ర సరిహద్దు కు రావాలంటే మమ్మల్ని అడ్డుకున్న పరిస్థితి.

గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు.

గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. 

గత ప్రభుత్వం పాలనను ఛిద్రం చేసింది.

ఐఏఎస్, ఐపిఎస్ లను ఆటబొమ్మలు చేయడం బాధ కలిగించింది. 

పతనమైన వ్యవస్థను పటిష్టం చేస్తాం. ఇందుకోసం అధికారులు వేగంగా, నిజాయితీగా పని చేయాలి. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది

ఏపీ అనేది ఒకప్పుడు ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండేది..గత ఐదేళ్లుగా చేసిన విధ్వంసంతో ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో అన్నదానికి ఉదాహరణగా ఏపీ నిలిచింది

రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాదక్షత,అనుభవం, దార్శనికత నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కోసం మేము కష్టపడుతాం. 

రాజ్యాంగాన్ని కాపాడటంలో మాకు చంద్రబాబు మార్గదర్శకత్వం అందిస్తారని మేం భావిస్తున్నాం.

మా తరపున ఏమైనా తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలి. మేము సరిదిద్దుకుంటాం. ప్రత్యేకించి మా మంత్రుల శాఖలో ఏవైనా లోపాలు కనిపించినా.. మా దృష్టికి తీసుకురండి.. మేము వాటిని పరిష్కరిస్తాము.

స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మాణం చేపడతాం. 

మంచినీరు అన్ని గ్రామాలకు అందించడమే మా లక్ష్యం.

5,40,000 మంచినీటి కుళాయిలను కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం

స్కిల్ సెన్సెస్ కోసం అధికారుల సలహాలు, సూచనలు అవసరం. 

వికసిత ఆంద్రప్రదేశ్ కోసం అధికారులు సూచనలు చాలా ముఖ్యం 

జవాబుదారీతనంతో కూడుకున్న ప్రభుత్వం వచ్చింది

గ్రామసభలు ఏర్పాటు చేస్తాం. గ్రామ పంచాయతీలను బలోపేతంచేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది..ఇది ఒక మహత్కార్యం.

ఫైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నుండి ప్రారంభిస్తాం

4781 కి.మీల రోడ్లు వేయాలని చర్యలు తీసుకుంటున్నాం.

అటవీ శాఖపై ప్రత్యేక దృష్టిసారించాం.

గుంటూరు, కర్నూలు, వెస్ట్ గోదావరిలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం

పంజాబీ వర్సిటీ ప్రొఫెసర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను.

స్కిల్ సెన్సెస్ కు సంబంధి యువతకు దిశానిర్దేశం చేయాలి.. 

వికసిత్ భారత్ కు పాటుపడదాం.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *