ఎన్‌టిఆర్ జిల్లా
తేది: 24.06.2025
జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డిఐపిఆర్‌ఓ.
డిఐపిఆర్‌ఓగా కె.వి. రమణరావు పదవీ భాధ్యతలు స్వీకరణ.
సమాచార పౌర సంబంధాల శాఖ ఎన్‌టిఆర్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కె.వి . రమణారావుకు మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఏలూరు జిల్లా సచామార పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న కె.వి. రమణరావును ఎన్‌టిఆర్ జిల్లాకు బదిలీ చేస్తూ సమాచార డైరెక్టర్ ఉత్వర్తులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న యు. సురేంద్రనాథ్ నుండి సోమవారం కె.వి. రమణరావు పదవీ బాధ్యతలను తీసుకున్నారు. ప్రభుత్వ శాఖలలో అత్యంత కీలకమైన సమాచార పౌరసంబంధాల శాఖలో డిఐపిఆర్‌ఓగా సమర్థవంతంగా పని చేసి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలోను అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు మధ్య సమన్వయం చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కె.వి. రమణరావుకు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.
జిల్లా కలెక్టర్‌ను కలిసిన వారిలో డిఐపిఆర్‌ఓ వెంట డి పి ఆర్ ఓ ఎస్. వి. మోహన్ రావు, డివిజనల్ పిఆర్‌ఓ కె. రవి, ఏవీఎస్ వి.వి. ప్రసాద్ తదితరులు ఉన్నారు.