జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 134 అర్జీలు నాణ్య‌త‌తో గ‌డువులోగా ప‌రిష్కారం చూపాలి జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

1
0

ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 30, 2025

జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 134 అర్జీలు

  • నాణ్య‌త‌తో గ‌డువులోగా ప‌రిష్కారం చూపాలి
  • జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

జిల్లాస్థాయి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మానికి 134 అర్జీలు వ‌చ్చాయని.. వీటిని క్షుణ్నంగా ప‌రిశీలించి గ‌డువులోగా నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అధికారుల‌ను ఆదేశించారు.
సోమ‌వారం కలెక్టరేట్ శ్రీ పింగ‌ళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్ ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పోలీసు శాఖ‌కు సంబంధించి 36, రెవెన్యూ శాఖ‌కు సంబంధించి 35, విద్యా శాఖ‌కు 12, మునిసిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి 11, ఏపీసీపీడీసీఎల్‌కు 5, పంచాయ‌తీరాజ్‌కు 4, మార్కెటింగ్‌కు 3, ఆరోగ్య శాఖ‌కు 3, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాకు మూడు అర్జీలు వ‌చ్చాయి. స‌ర్వే, ఏపీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌, విభిన్న ప్ర‌తిభావంతులు శాఖ‌, ఆర్ఐవో, పౌర‌స‌ర‌ఫ‌రాల విభాగాల‌కు రెండు చొప్పున అర్జీలు వ‌చ్చాయి. ఉద్యాన శాఖ‌, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్‌, వ్య‌వ‌సాయం, డీఆర్‌డీఏ, డ్వామా, బీసీ కార్పొరేష‌న్‌, ఇరిగేష‌న్‌, గ్రామ వార్డు స‌చివాల‌యాలు, దేవాదాయ‌, మైన్స్ అండ్ జియాల‌జీ, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, నీటి వ‌న‌రులు విభాగాల‌కు ఒక్కో అర్జీ వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీల‌ను నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌న్నారు. రీ ఓపెన్ కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించాల‌ని.. ఇందుకు క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.
కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ కె.పోసిబాబు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here