28-06-2026
జిల్లాలో 28 పోలీస్ స్టేషన్లు మోడరన్ స్టేషన్స్ చేసేందుకు సహకారం అందిస్తాను : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో సురక్షా 360 ప్రారంభోత్సవం
ముఖ్య అతిథులుగా హాజరైన వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా, గద్దె, కొలికపూడి, శ్రీరాం రాజగోపాల్
విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమీషనర్ రాజశేఖర్ బాబు టెక్నాలజీ పరంగా విన్నూతమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల సత్యనారాయణ పురంలో మోడరన్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించటం జరిగింది, అలాగే జిల్లాలోని 28 పోలీస్ స్టేషన్లు మోడరన్ తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తే తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు.
సుజన ధి వెన్యూ ఫంక్షన్ హాల్ లో శనివారం పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ఆద్వర్యంలో ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనర్ రేట్ పోలీస్ స్టేషన్ పరిదిలో ప్రజల భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ కోసం 321 గ్రామాలు, 20 మండలాలు, 4 మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ, 64 వార్డులు మొత్తం 1211 చ.కిలోమీటర్లు నగరాల నుండి గ్రామాల వరకు 100 శాతం సి.సి.కెమెరాల ద్వారా కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేసిన సురక్షా 360 ప్రారంబించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎన్.టి.ఆర్.జిల్లా ఎం.పి. కేశినేని శివనాద్ (చిన్ని) , ఎం.ఎల్.ఏ.లు యలమంచిలి సుజనా చౌదరి , బొండా ఉమా మహేశ్వర రావు , గద్దె రామ్మోహన , శ్రీరామ్ రాజగోపాల్ , కొలికపూడి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశా ఐ.ఎ.ఎస్., డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హోమ్ మంత్రి వంగల పూడి అనిత చెప్పినట్లు జైళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయటంతో పాటు మహిళలకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 28 పోలీస్ స్టేషన్లు మోడరన్ పోలీస్ స్టేషన్స్ గా తీర్చిదిద్దేందుకు నెల రోజులు ప్రణాళికలు సిద్దం చేస్తే…సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిజిపిల తో ఆమోదం పొందెందుకు సహకారం అందిస్తానని సీపీ రాజేశేఖర్ బాబుకు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ప్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ వుందని, ఎన్టీఆర్ జిల్లాలోని పోలీస్ శాఖ పనితీరును మిగిలిన జిల్లాల పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
. ఎన్టీఆర్ జిల్లా లోని ఆలయాలను పరిరక్షించేందుకు డివైన్ సురక్ష తో పాటు, సురక్ష 360 ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు, రాష్ట్రంలో సామాజిక అవగాహన ఎక్కువ ఉన్న నగరం విజయవాడ, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు సహకరిస్తూ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి నగరవాసులు సాయం చేయడం గొప్ప విషయమంటూ నగరవాసులను కొనియాడారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని ప్రూఫ్ కాన్సెప్ట్స్ కి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ముందు ఉందన్నారు, పోలీసు కమిషనర్ రాజ శేఖర బాబు గారి ఆధ్వర్యంలో స్కూల్స్ , కళాశాలలో సురక్ష విద్య, మార్కెట్ లలో సురక్ష మార్కెట్ రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు., అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ ను నేర రహిత ప్రాంతంగా చేయటమే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 30 లక్షల రూపాయలతో నియోజకవర్గ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి ధన్యవాదాలు అని తెలియజేశారు.