
జాతీయ రహదారి ముంపును నివారించండి : యార్లగడ్డ
గన్నవరం :
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంతోపాటు, జాతీయ రహదారి కొద్దిపాటి వర్షానికే ముంపు బారిన పడుతున్నాయని తక్షణమే వర్షపు నీరు బయటకు పోయేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ప్రసాదంపాడు గ్రామంలోని తుఫాను ముంపుకు గురైన ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం నుంచి అమరావతికి గల ప్రధాన రహదారిపై తరచూ వర్షపు నీరు నిలవడం దారుణమనీ సంబంధిత అధికారులు శ్రద్ధ పెట్టి ఈ రహదారి పై వర్షపు నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకుని ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. ప్రసాదంపాడు గ్రామంలో ముంపుకు కారణమవుతున్న తిప్పగుంట డ్రైన్ పూడిక తీసి సక్రమంగా నీటిపారుదల జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జాతీయ రహదారిపై ఎడమవైపున కచ్చా డ్రైన్ తవ్వి గ్రామంలోనూ,రహదారిపైనా నీరు నిలవకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు గుజ్జర్లపూడి బాబురావు, విజయవాడ రూరల్ మండల తెలుగు మహిళ అధ్యక్షులు నెక్కంటి శ్రీదేవి, టిడిపి నాయకులు బొప్పన హరికృష్ణ, సర్నాల బాలాజీ, కొల్లా ఆనంద్, కోనేరు నాని, పోలిశెట్టి రమణ, గూడపాటి తులసి మోహన్, నభిగాని కొండ, ఉల్లాస శివ, అద్దేపల్లి సాంబు తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
