10.07.2025.
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని జిల్లాలో కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గంజి మాలాదేవి అన్నారు.
జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టం అమలును గురువారం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గంజి మాలాదేవి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ రూరల్ ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి, కుంటుముక్కల గ్రామంలోని అంగన్వాడీలు, చౌక ధర దుకాణాలు, సంక్షేమ వసతి గృహాలలో తనిఖీ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమైన చట్టం అన్నారు. దీని ద్వారా
ఆహార భద్రతను నిర్ధారించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం జరుగుతుందని తద్వారా
పేదరికాన్ని తగ్గించడానికి దోహదపడుతుందన్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు సహాయపడుతుందని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గంజి మాలాదేవి అన్నారు.
క్షేత్రస్థాయి పర్యటనలో డీఎస్ఓ పాపారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.