జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశకు ఏపీయూడబ్ల్యూజే నేతల వినతి
విజయవాడ ఆగస్టు 5: APUWJ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే పేరుతో ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి కి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడిటేషన్లను ఈ ప్రభుత్వం పొడిగిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అలాగే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, మిగిలిన పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ యూనిట్ ప్రెసిడెంట్ చావా రవి, ప్రెస్ క్లబ్ సెక్రటరీ దాసరి నాగరాజు, ఐజేయు కౌన్సిల్ మెంబర్స్ షేక్ బాబు, కూన అజయ్ బాబు, ఏపీ స్టేట్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయభాస్కర్, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ రఘురాం, నాగమల్లేశ్వరరావు, సామ్నా విజయవాడ నగర అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శి గంగరాజు, సీనియర్ నాయకులు జి.రామారావు, అర్బన్ యూనియన్ నేతలు బి.వి శ్రీనివాస్, బొర్రయ్య, శివరామకృష్ణ, కోటిరెడ్డి , హుస్సేన్, కుమార్, ఖదీర్, తిరుమలరావు , సాంబశిరావు , శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.