జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాను – ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
విజయవాడ: ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ని విజయవాడ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా APUWJ రాష్ట్ర డైరీను ఎమ్మెల్యే కి అందజేశారు.ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చ జరిగింది. జర్నలిస్టుల హక్కులను రక్షించేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో APUWJ జిల్లా నాయకులు అట్లూరి రాజశేఖర్, మున్నంగి నిరీక్షణ రావు, ధనియాల అప్పారావు, కోడూరి రామకృష్ణ, కోటేశ్వరరావు, చెంచుకృష్ణ, రాంబాబు, సురేష్, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.