జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ కలసి ఆడిన నాటకమే అక్రమ నకిలీ మద్యం.
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భారీ ప్లాన్ వేశారు.
ములకలచెరువులో కథ రక్తి కట్టలేదని ఇబ్రహీంపట్నంలో మరో డ్రామాకు తెరలేపారు.
జోగి రమేష్ అనే అసాంఘిక శక్తిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలి.
2024లోనే ఏ.ఎన్.ఆర్ బార్ ను తొలగించాలని నేను ఎక్సయిజ్ అధికారులకు లేఖ వ్రాసాను.
దమ్ముంటే మీ ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టు.
అద్దేపల్లి జనార్దన్ నిన్ను కలిశాడో లేదో తెలుస్తుంది.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
అమరావతి, 14.10.2025.
జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ కలసి ఆడిన నాటకమే అక్రమ నకిలీ మద్యం వ్యవహారం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని వారిద్దరూ కలసి భారీ ప్లాన్ వేశారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంగళవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ
“కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధిని చూడలేక వైసీపీ అధినేత, వారి అరాచక మూకలు, ప్రభుత్వంపై కుట్రలకు తెరలేపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఆయనకు చెడ్డపేరు తీసుకురావాలని జోగి రమేష్ ఒక అసాంఘిక శక్తి కావాలని ఉద్దేశ్యం పూర్వకంగా కుట్ర పన్నాడు.
జోగి రమేష్ చిన్ననాటి స్నేహితుడు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు. ఇతను ఎప్పటినుంచో లిక్కర్ వ్యాపారంలో వున్నాడు. వీరిద్దరూ కొన్ని దశాబ్దాలుగా వ్యాపార భాగస్వాములు.
ములకలచెరువులో నకిలీ మద్యం వెలుగు చూడగానే ప్రభుత్వం, పార్టీ వెంటనే స్పందించి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం రక్తి కట్టలేదని, ఇబ్రహీంపట్నంలో గోడౌన్లో కూడా మరో నకిలీ మద్యం వ్యవహారం నడిపాడు.
అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఏ.ఎన్.ఆర్ బార్ ను తొలగించాలని, అక్కడి ప్రజలకు ఇబ్బందిగా ఉందని నేను ఎక్సయిజ్ అధికారులకు 18.10.2024న లేఖ వ్రాసాను.
అద్దేపల్లి జనార్ధనరావు సౌత్ ఆఫ్రికా వెళ్లేముందు 23న రాత్రి 8:30 గంటల సమయంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఆయన్ని కలసి గంట సేపు మాట్లాడి వెళ్ళాడు.
జోగి రమేష్ వ్యవహార శైలి రోజు రోజుకు మారుతూ వస్తోంది. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు అతని తీరు మారింది.
నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ నాటకం ఆడి, అన్ని తానై నడిపించి, ఇందులో నాపై, సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ పై అవాకులు చవాకులు పేలుతూ బురద జల్లుతున్నాడు.
తంబళ్లపల్లెలో కూడా జోగి రమేష్ కు చెందిన సురేష్ అనే వ్యక్తి మద్యం తయారీ గురించి అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చాడు.
ఇబ్రహీంపట్నంలో కూడా అధికారులు పరిశీలన చేస్తుంటే, అక్కడికి వెళ్లి కూడా జోగి నానా యాగీ చేశాడు.
ఒకపక్క రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తూ సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో ఎంతో కష్టపడుతుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు.
జోగి రమేష్ లాంటి నయవంచకులను రాజ ద్రోహం కేసులు పెట్టి, తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం ఇది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చి నిన్న ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ప్రతిసారి ఏదోరకంగా ఆందోళనలో అలజడలు సృష్టించడమే వైసీపీ పార్టీ ఎజెండాగా మారింది. కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు నడిపారు. అలాగే ఇప్పుడు నకిలీ మద్యం డ్రామాను కూడా ప్లాన్ చేశారు. దీన్ని ప్రభుత్వంపై రుద్ది రాజకీయ లబ్దికి యత్నించారు.
2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశాడు. కానీ చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏపీని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ రకంగా చనిపోయిన కల్తీమద్యం అంటూ వైసీపీ దుష్ప్రచారం చేసింది.
గత వైసీపీ పాలనలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేస్తోందని అసత్య ప్రచారం చేశారు.
రాజధాని భూసేకరణను అడ్డుకున్నారు. అమరావతి మునిగి పోతుందని స్వంత పత్రికలో, ఛానెల్లో కథనాలను వండి వార్చారు.
మంత్రి పదవి కోసం దిగజారి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు దాడికి వెళ్ళిన జోగి రమేష్‌ను ముందు పెట్టి, జగన్మోహన్ రెడ్డి ఈ నాటకానికి తెరతీసాడు.
ఈ నకిలీ అక్రమ మద్యం కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను వెలుగులోకి తేవాలి, వెంటనే వారిని అరెస్ట్ చేయాలి. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నిన జోగి రమేష్ పై చర్యలు చేపట్టాలి.
జోగి రమేష్, అద్దేపల్లి జనార్దన్ వాట్సప్ చాట్ కూడా బయటకు వచ్చింది. ఏ దొంగలైనా ఏదో ఒక పొరపాటుతో దొరికిపోతారు. మరో నాలుగు, ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తుపోయే నిజాలన్నీ బయటకు వస్తాయి.
అద్దేపల్లి జనార్దన్ మీ ఇంటికి వచ్చాడా లేదా అని విలేకరులు ప్రెస్ మీట్ లో అడిగితే జోగి రమేష్ సమాధానం దాట వేశాడు. మీ ఇంటి సీసీ ఫుటేజ్ బయట పెడితే వాస్తవం తెలుస్తుంది కదా..!
జోగి రమేష్ లాంటి విద్రోహులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటు లేదు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలను, జోగి రమేష్ లాంటి అరాచక వాదులను గుర్తించాలి.” అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
![]()
