జగన్అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము లేదా?: ఏపీ హోంమంత్రి అనిత

Spread the love

 అమరావతి

జగన్అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము లేదా?: ఏపీ హోంమంత్రి అనిత

రాష్ట్రంలో ఇప్పటికీ తెదేపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ దిల్లీ వీధుల్లో సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అనిత మాట్లాడారు.

“రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో జగన్ అబద్ధాలు చెప్పారు. హత్యకు గురైనవారి పేర్లు అడిగితే ఆయన చెప్పలేకపోయారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్కు లేదా? అసెంబ్లీలో అడగకుండా దిల్లీలో మాట్లాడితే ఏం లాభం? రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మర్చిపోయారా? శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందా?. హోంమంత్రిగా జగన్ న్ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నా. హత్యల వివరాలు అందిస్తే తగిన విచారణ చేయిస్తాం. తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలినా చర్యలు తీసుకుంటాం.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *