అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన పత్రికాసమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టిబెట్ (అరుణాచల్ ప్రదేశ్) మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సైన్యాలను సరిహద్దులకు తరలించేందుకు సర్వకాలాల్లోనూ అందుబాటులో ఉండే ఈ టన్నెల్‌కు భద్రతాకారణాల రీత్యా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణ చైనా తమ భూభాగమని పేర్కొంది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము ఎన్నడూ గుర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది.
మరోవైపు, చైనా ప్రకటనపై భారత్ కూడా దీటుగా స్పందించింది. ఉత్తుత్తి పేర్లతో క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను మార్చలేరంటూ చైనా వ్యాఖ్యలను ఖండించింది.
Spread the love ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం రాత్రి లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్ వేదికగా ఘనంగా జరిగింది. అయితే, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ డిమాండ్‌కు మద్దతివ్వాలని […]
Spread the love కరీబియన్ దేశం ‘హైతీ’లో పేరుకే ప్రభుత్వం ఉంటుంది కానీ అక్కడంతా కిడ్నాపర్లదే రాజ్యం.. దేశంలోని చాలాప్రాంతాల్లో నిత్యం గ్యాంగ్ వార్లు జరుగుతుంటాయి. కిడ్నాప్ లు సర్వసాధారణం.. అలాంటి చోటుకు ఓ […]
Spread the love టేకాఫ్ చేస్తుండగా విమానం చక్రం ఊడిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లాస్ఏంజిలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. […]