Home Political news చేనేత వస్త్రాలను ఆదరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పశ్చిమ నియోజకవర్గ...

చేనేత వస్త్రాలను ఆదరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పశ్చిమ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)

2
0

 చేనేతకు చేయూతనిస్తాం

సుజనా చౌదరి

చేనేత వస్త్రాలను ఆదరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పశ్చిమ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యరావుపేటలోని ఎన్టీఆర్ జిల్లా బిజెపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సుజనా మాట్లాడుతూ చేనేత మగ్గాల పై ఆధారపడి అవస్థలు పడుతున్న చేనేత కార్మిక రంగాన్ని , కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు విధిగా ధరించాలన్నారు. మనదేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగ మేనని ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం గా పాటించాలని 2015 లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విదేశీ వస్త్రాల మోజులో పడకుండా ప్రజలు చేనేతను ప్రోత్సహించి చేయూత నివ్వాలన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో నేతన్నల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం తెలుగుదేశం హయాంలో అమలు చేసిన పథకాలను తిరిగి అమలు చెసి చేనేతకు పూర్వ వైభవం తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. చేనేత కార్మికులకు బాసటగా నిలవాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. చేనేతను ధరిస్తూ తనను తాను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేతన్నల కళ్ళలో సంతోషాన్ని చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీ తగిన ప్రోత్సాహాన్ని, సబ్సిడీలను, బ్యాంకు రుణాలను,అందజేసి చేనేతకు చేయూతనిస్తున్నారని తెలిపారు. అనంతరం బిజెపి నాయకులతో కలిసి చేనేత వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజి చైర్మన్ నాగుల్ మీరా, బిజెపి నాయకులు శ్రీనివాస్ రాజు ,షేక్ బాజీ, బోగవల్లి శ్రీధర్, బి ఎస్ కే పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయి, మువ్వల వెంకటసుబ్బయ్య, కేఎస్ ఆర్ముగం, పైలా సోమినాయుడు, నరసరాజు, పోతిన బేసు కంటేశ్వరుడు, మహిళా మోర్చా అధ్యక్షురాలు యర్ర సునీత,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here