చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ ని పరామర్శించిన మంత్రి మండిపల్లి….
శివకుమార్ కు 2.00 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కు ఇచ్చిన మంత్రి
చిత్తూరు జూలై 12:- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై ఇటీవల వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ ను అక్కడికి వెళ్లి పరామర్శించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఇప్పటివరకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శివకుమార్ కు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నాయకుల ప్రోద్బలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ వివరిస్తుంటే చాలా బాధ కలిగింది. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై, మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడులను క్షమించేది లేదు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. శివకుమార్ పై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాము. మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది..