చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు తాగునీరు అందజేయాలి*సిపిఐ. కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్

Spread the love

 చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు తాగునీరు అందజేయాలి*సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్

చింతలపూడి త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగు త్రాగునీరు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 స్థానిక డిపో సెంటర్లో గల సుంకర వీరభద్ర రావు భవన్ సిపిఐ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ

 రైతాంగానికి సాగు పెట్టుబడి కింద ప్రభుత్వం ప్రకటించిన 20వేల నగదును వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అన్నారు.

సాగు పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాలకు ఎంత అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని శంకర్ పేర్కొన్నారు.గోదావరి జలాల రాకతో మెట్ట మండలాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఎత్తిపోతల పథకం కాలువ పనులు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులుఎక్కడికక్కడ నిలిచిపోయాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ అన్నారు. ఈ కాలువ తాళ్లపూడి వద్ద ప్రారంభమై గుడ్డిగూడెం జీలుగుమిల్లి టీ నర్సాపురం చింతలపూడి మీదుగా కృష్ణా జిల్లా పరిధిలో. నూజివీడు మైలవరం గన్నవరం తిరువూరు నందిగామ జగ్గయ్యపేట ప్రాంతాలలో సాగు తాగు అవసరాలకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టును అప్పటి ప్రారంభించిన టువంటి తెలుగుదేశం ప్రభుత్వం కొంత మేర పనులు చేసిన గాని గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన పనులు శూన్యమని అన్నారు.

 చంద్రబాబునాయుడు గారు చిరకాల కోరిక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు .

కృష్ణా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని మెట్ట రైతులకు ఉపయోగపడేటటువంటి ఈ సాగు కాలువను గత కొంతకాలంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక దపాలుగా రాష్ట్ర జిల్లా నాయకత్వాల పరిశీలన పరిశీలించి అనేకమార్లు ఆందోళన చేసి గత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర కూటమి ప్రభుత్వం కల్పించుకొని పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేటటువంటి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు.ఈ కాలువలకు భూమి ఇచ్చిన రైతులు వ్యవసాయ కూలీలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చినటువంటి రైతులు రైతు కూలీలకు తక్షణమే భూ నష్టపరిహారం చెల్లించాలని కోరారు.గతంలో ఆయా ప్రాంతాల్లో భూమిని సేకరించి పనులు ప్రారంభించిన పనులు నిలిచిపోయాయి అని అన్నారు. కాలువ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు పనులు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నారని అన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులతూము కృష్ణయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, సిపిఐ తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి ఎస్కె నాగుల మీరా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు లంక గోవిందరాజులు, సిపిఐ తిరువూరు పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్, ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే సుభాని, తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *