చంద్రబాబు ప్రభుత్వం పోతుంది.. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే!
ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది
మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే
రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది
ఏపీలో ఒక్కటే ప్రతిపక్ష పార్టీ
అమరావతి
ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్మిట్ నిర్వహించారు.
రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ రాజ్యాంగం నడుపుతున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. చట్టాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏపీలో ఒక్కటే ప్రతిపక్ష పార్టీ.. మిగతా ప్రధాన పార్టీలు టీడీపీతో అధికారాన్ని పంచ