ఘనంగా బిజెపి నాయకులు పోతిన వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

Spread the love

ఘనంగా బిజెపి నాయకులు పోతిన వెంకటేశ్వర

రావు జన్మదిన వేడుకలు

విజయవాడ పశ్చిమ , జూన్ 29, (ఆంధ్ర పత్రిక) : బిజెపి సీనియర్ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు శనివారం సాయంత్రం కొత్తపేట దూది ఫ్యాక్టరీ వీధిలోని ఆయన స్వగృహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు ,కార్యకర్తలు విచ్చేసి పోతినకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల మనిషి, రాజకీయ దురంధరుడైన పోతిన వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోతిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయం తనలో నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వై.సుజనా చౌదరి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, అబ్దుల్ ఖాదర్ , దాడి అప్పారావు, దుర్బేసుల హుస్సేన్, ప్రముఖ న్యాయవాదులు గోగుశెట్టి వెంకటేశ్వరరావు, అడ్డురి శ్రీరామ్, భోగవల్లి శ్రీధర్, కొలపల్లి గణేష్, రాంపిళ్ళ శ్రీనివాసరావు, చిట్టినగర్ అమ్మవారి దేవస్థానం కమిటీ గౌరవాధ్యక్షులు బెవర సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, రాంపిళ్ళ శ్రీనివాసరావు మాస్టారు, భరత్ ,పోతిన అచ్యుతరావు, పోతిన అవినాష్, దొడ్ల రాజా, బి శివకుమార్ పట్నాయక్, తంగెళ్ల రాము తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *