ఘనంగా ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నాల్గవ వార్షికోత్సవం వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

Spread the love

 ఘనంగా ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నాల్గవ వార్షికోత్సవం

వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 26.06.2024

ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నాల్గవ వార్షికోత్సవ వేడుకలను మీడియా సోదరులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేకులు కట్ చేసి, మీడియా సోదరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా సోదరులు అంకితభావంతో పని చేస్తున్నారని వారి సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *