30- 09- 25*
ఘంటసాలలో చింతా వెంకట సీతారామఆంజనేయులు బృందంచే కూచిపూడి నృత్యరవళి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివల్ “విజయవాడ ఉత్సవ్” నగరంలోని ఘంటసాల ప్రభుత్వ కళాశాల నందు 9వ రోజు సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అభినయ ఆర్ట్స్ విజయవాడకు చెందిన చింతా వెంకట సీతారామఆంజనేయులు బృందంచే కూచిపూడి నృత్యరవళి కన్నుల పండువుగా సాగింది. తొలుత మహగణపతితో కూచిపూడి నృత్య ప్రద్శన ప్రారంభించగా బ్రహ్మంజలి, గతీశ్వరం, గణనాయక, ఇదిగో బద్రాద్రి, అన్నమయ్య, శ్రీనివాస కళ్యాణం తదితర పాటలకు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.కార్యక్రమంలో ప్రజ్ఞ, త్వరిత, సుమేధ, సాయి మేఘన ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
![]()
