గేర హనోక్ కు మల్లాది విష్ణు అభినందనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన గేర హనోక్ గురువారం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హనోక్ ను మల్లాది విష్ణు అభినందించారు. పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. హనోక్ కు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు.