గురు పౌర్ణమి, లేదా వ్యాస పౌర్ణమి, గురువులను మరియు ఉపాధ్యాయులను గౌరవించే పండుగ. ఇది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున గురువుల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. గురు పౌర్ణమి గురువుల యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. వారు మనకు జ్ఞానం మరియు మార్గదర్శకత్వం అంగురువులు మన జీవితాల్లో వెలుగులు నింపే దివ్యశక్తులు. వారు మనకు జ్ఞానాన్ని, వివేకాన్ని, నైతిక విలువలను నేర్పిస్తారు. వారి మార్గదర్శకత్వంలో మనం జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాము. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ గురువులను గౌరవించాలి మరియు వారి ఆశీస్సులను పొందాలి.
కావున ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానములో కార్యనిర్వహణాదికారి వారి ఆదేశముల మేరకు 1. తంగిరాల వేంకటేశ్వర ఘనపాఠీ, వేదపండితులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానము, విజయవాడ వారి దంపతులు , 2. శంకరమంచి శివ ప్రసాద్ , సీనియర్ ముఖ్య అర్చకులు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానము, విజయవాడ 3. ఆహితాగ్ని గుంటూరు శ్రీ రామచంద్ర సోమయాజులు దంపతులు వీరు కృష్ణలంక వేద పండితులు వీరికి శ్రీ అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు, అమ్మవారి వస్త్ర ప్రసాదములు, నగదు బహుమతి ఇచ్చి ఘనంగా సన్మానించి తదుపరి గురువులు ఆశీస్సులను భక్తులు పొందుట జరిగినది.