గుడివాడ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తాం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
విద్యుత్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే…
నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి పనులను…వివరించిన అధికారులు
ప్రజల విద్యుత్ సంస్థల పరిష్కారానికి….90 లక్షలతో నూతన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశాం
గుడివాడ జూలై 30:గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలను పరిష్కరించేలా కోట్లాది రూపాయల నిధులతో గుడివాడలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు ఎమ్మెల్యే రాము వివరించారు. నిర్లక్ష్యానికి తావులేకుండా విద్యుత్ సంస్థలపై స్పందించాలంటూ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…
ప్రజలకు మంచి చేయడమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వా లక్ష్యమని పేర్కొన్నారు. గుడివాడలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.
గుడివాడ టిడ్కో కాలనీ నుండి గుడ్లవల్లేరు మండలం కౌతవరం సబ్ స్టేషన్ వరకు 13 కిలోమీటర్ల మేర రూ.2.20 కోట్లతో 33కె.వి నూతన విద్యుత్ లైన్ నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు.
నందివాడ మండలంలో ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడి గ్రామాల్లో అధికంగా విద్యుత్ సమస్యలు అధికంగానెలకొన్నాయన్నారు. అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోటి 40 లక్షల నిధులతో నూతన విద్యుత్ లైన్లు వేస్తున్నట్లు తెలిపారు. ఆ పనులు ఇప్పటికే 80% పూర్తయి అయ్యాయని తెలిపారు.
ప్రజల విద్యుత్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని 56 లక్షల నిధులతో గుడివాడ పట్టణంలో ఐదు, నందివాడ మండలం లక్ష్మీనరసింహ పురంలో ఒక హెవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.
లోవోల్టేజీ సమస్యల నిర్మూలనకు నందివాడ మండలంలో 34 లక్షల నిధులతో మరో ఆరు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు.
నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తలెత్తితే ప్రజావేదిక కార్యాలయం దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎలక్ట్రికల్ డీఈ శ్రీనివాసరావు, టౌన్ ఎలక్ట్రికల్ ఏడి బాపిరాజు, గుడ్లవల్లే ఏడి కిరణ్, ఏఈలు ఉష, బ్రహ్మానందరావు, కుమార్, సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.