గుడివాడ అభివృద్ధికి రూ.608 కోట్ల నిధులు మంజూరు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

6
0

గుడివాడ అభివృద్ధికి రూ.608 కోట్ల నిధులు మంజూరు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

కూటమి ఏడాది పాలనపై… ఎమ్మెల్యే రాము, ప్రెస్ మీట్

రూ.60 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు పూర్తి….

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నిర్మితమయ్యే తొలి బస్టాండ్ గుడివాడలోనే…..

గత ప్రభుత్వ చేతకాని పాలనతోనే రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు….

కూటమి ప్రయాణం ఎంతో సాఫీగా సాగుతుంది…

గుడివాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత…

పార్టీలో ఐక్య నిర్ణయంతోనే ముందుకు సాగుతున్నాను…..

గుడివాడ అభివృద్ధికి సోదరుడు ఎంపీ బాలసౌరి సహకారం ఎనలేనిది….

ఏడాదిగా సాధించిన విజయాలతో… రాబోవు నాలుగేళ్లలో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తా

గుడివాడ జూన్12: కూటమి ప్రభుత్వ హయాంలో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ.608 వందల కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు. ప్రజలకు మంచి చేయడంలో కూటమి నేతలందరం కలిసికట్టుగా ముందు సాగుతున్నామన్నారు

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఎమ్మెల్యే రాము నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు అంశాలపై మాట్లాడారు…. గుడివాడ అభివృద్ధికి మంజూరైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వివరాలను ఆయన వెల్లడించారు.

గుడివాడలో రైల్వే గేట్ల వద్ద సమస్యల పరిష్కారానికి ఫ్లేఓవర్లు మరియు అండర్ పాస్ ల నిర్మాణానికి రూ.4వందల కోట్ల నిధులు మంజూరు అయ్యాయని…. రైల్వే ఉన్నతాధికారుల సాంకేతిక పరిశీలన తర్వాత ఆ పనులు మొదలవుతాయన్నారు.

అమృత్ ఫేస్ 2లో భాగంగా గుడివాడ పురపాల సంఘం అభివృద్ధికి రూ.136 కోట్లు మంజూరు అయ్యాయని అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతాల్లో ఇప్పటికే అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందన్నారు.

గుడివాడలో ప్రధాన రహదారుల అభివృద్ధికి నేషనల్ హైవే శాఖ నుండి రూ.35.23 కోట్లు మంజూరు అయ్యాయని. ఆ పనులు కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే రాము తెలిపారు.

రూ.15.62కోట్ల NRGS నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో 276 రోడ్లు నిర్మాణం పూర్తి అయిందన్నారు.రూ.10 కోట్ల నిధులతో కాల్వలు, డ్రైనేజీలలో జరుగుతున్న అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఇతర అభివృద్ధి పనులన్నీ వివిధ దశలో ఉన్నట్లు ఎమ్మెల్యే రాము తెలియచేశారు.

తొలి బస్టాండ్ గుడివాడలోనే నిర్మితమవుతుంది

గుడివాడలో ఎమోషన్ తో కూడుకున్న సమస్య అయిన బస్టాండ్ నిర్మాణానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో నిర్మితమయ్యే తొలి బస్టాండ్ గుడివాడదే అవుతుందన్నారు. గతంలో లాగా కాకుండా వర్షాలు పడినప్పుడు నీరు నిలవకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని కొద్దికాలం ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు.

గుడివాడ అభివృద్ధికి ఎంపీ బాలసౌరీ సహకారం ఎనలేనిది…

గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు సోదరుడు ఎంపీ వల్లభనేని బాలశౌరి అందిస్తున్న సహకారం ఎనలేనిదని ఎమ్మెల్యే రాము అన్నారు. ముఖ్యంగా రహదారులు మరియు రైల్వే గేట్ల వద్ద సమస్యల పరిష్కారానికి బాలశౌరీ సహకారం లేకుంటే ఇన్ని వందల కోట్ల నిధులు మంజూరయ్యేవి కాదన్నారు. సోదరుడు బాలసౌరీతో కలిసి గుడివాడ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

సాఫీగా కూటమి ఏడాది ప్రయాణం….

కూటమి నేతలందరం గుడివాడ అభివృద్ధి, ప్రజలకు మంచి చేయడం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామన్నారు. కూటమి నేతల ఏడాది ప్రయాణం ఎంతో సాఫీగా సాగిందని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు.

ఐక్య నిర్ణయంతోనే పార్టీ కమిటీల నియమకం…

తెలుగుదేశం పార్టీలో అందరిని కలుపుకుంటూ ముందుకు వెళుతున్నానన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీల నియమకంలో ఐక్య నిర్ణయంతోనే ముందుకు సాగుతున్నామన్నారు. పనిచేసే వారికి, నిబద్ధతగలవారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులు అందరం ఐక్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. పనీపాటా లేని వాళ్లు చేసే సొల్లు వాగుళ్లను నేను పట్టించుకోనన్నారు.

ఏడాదిగా సాధించిన విజయాల స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో రాబోవు నాలుగేళ్లలో గుడివాడ రూపురేఖలు మార్చేలా అవిశ్రాంతంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here