గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ కచ్చితంగా జరగాలి

Spread the love

విజయవాడ నగరపాలక సంస్థ
06-11-2025

గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ కచ్చితంగా జరగాలి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ కచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అట్టరత్తయ్య వీధి, హనుమాన్ పేట గవర్నర్ పేట, సాంబమూర్తి రోడ్డు, జి ఎస్ రాజు రోడ్డు, అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న గార్బేజి లోడర్ పాయింట్లన్నిటిలోనూ కంపాక్టర్ బిన్లు కేవలం లోపలే ఉండాలని బయట ఉండకూడదని, దానికి అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ పేటలో పాడైపోయి ఉన్న టాయిలెట్ కంటైనర్ ను వెంటనే తొలగించాలని అన్నారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ లో వ్యర్థ నిర్వహణ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలని, ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందాల్ కు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తదుపరి అజిత్ సింగ్ నగర్ లో ఉన్న అన్న క్యాంటీన్లో పరిశీలించారు అక్కడున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారు అన్న క్యాంటీన్లో సౌకర్యాలు అన్ని బాగున్నాయని తెలియపరచగా, ఇది కేవలం అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్లనే సాధ్యమవుతుందని, అధికారులు ప్రతిరోజు తమ తమ అన్న క్యాంటీన్లను ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఏమైనా మరుమతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, శానిటరీ సూపర్వైజర్ శివరాం ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

Loading