గన్నవరం నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ శుభవార్త
చెప్పారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 న *అమరరాజా గ్రూప్* సంస్థల సహకారంతో గన్నవరంలోని రోటరీ క్లబ్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా మిషన్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పద్ధతిలో ఎంపిక జరుగుతుందన్నారు. సుమారు 1000 కి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. పదవ తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్మీడియట్, ఐటీఐ లో ఏ కోర్స్ వారైనా ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చునని చెప్పారు. ఈ ఉద్యోగ అవకాశాన్ని నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గ యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. మల్లవల్లి పారిశ్రామికవాడతో గన్నవరం నియోజకవర్గం దశ-దిశ మారనుందని చెప్పారు.