జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయింపుగన్నవరం : గన్నవరంలో మాజీ ప్రధానుల విగ్రహాల ఏర్పాటుకు 1.5 సెంట్లు స్థలం కేటాయించారు. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఆదేశాల మేరకు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రహదారి సుందరీకరణ పనులు చేయుటకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఈ మేరకు రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను తొలగించాల్సి వచ్చింది. ఈ ముగ్గురు మాజీ ప్రధానుల విగ్రహాల ఏర్పాటుకు అదే చోట స్థలం కేటాయించి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంకట్రావు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ముగ్గురి విగ్రహాలు ఏర్పాటు కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే 1.5సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేయించారు. ఈ విగ్రహాల ఏర్పాటుకు గ్రానైట్ దిమ్మేల నిర్మాణం నిమిత్తం గ్రామపంచాయతీ నుంచి నిధులు మంజూరు చేయించారు. భూముల కేటాయింపు ఉత్తర్వులను ఎమ్మెల్యే వెంకట్రావ్ ఆదివారం ఉదయం ఎఐసిసి సభ్యులు దనేకుల మురళీమోహన్ , కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోల్లు కృష్ణలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తమలం జాన్సీ రాణి, గన్నవరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోగులముడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
![]()
