గన్నవరంలో కేసులపై బహిరంగ చర్చకు సిద్ధమా యార్లగడ్డ సవాల్

0
0

గన్నవరంలో కేసులపై బహిరంగ చర్చకు సిద్ధమా యార్లగడ్డ సవాల్

మచిలీపట్నం :

గన్నవరం నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏఒక్కరి పైనా అక్రమ కేసు పెట్టలేదని ఈ విషయంలో పేర్ని నాని బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సవాల్ విసిరారు. ఇటీవల గన్నవరం వచ్చిన పేర్ని నాని గన్నవరం లో వైసీపీ నాయకులు కార్యకర్తలపై యార్లగడ్డ అక్రమ కేసులు పెడుతున్నారంటూ వ్యాఖ్యనించారు. మచిలీపట్నంలో పోలీసు శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం బందరు వచ్చిన యార్లగడ్డ విలేకరులతో మాట్లాడుతూ పేర్ని నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ తనకు సంబంధం లేని విషయాలను తనకు ఆపాదిస్తూ పేర్ని నాని వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. గన్నవరం నియోజకవర్గంలో 2019 నుంచి ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయో పోలీస్ స్టేషన్ల వారీగా వివరాలు తీసుకొని చర్చిద్దామని సవాల్ చేశారు. దీనికి మంది మార్బలం అవసరం లేదని నాని ఒకడే రావాలని తాను ఒక్కడినే వస్తానని ఇద్దరం కూర్చుని చర్చిద్దామన్నారు. 2019 నుంచి 24 వరకు టిడిపి నాయకులు కార్యకర్తలపై లెక్కలేనన్ని అక్రమ కేసులు పెట్టారని యార్లగడ్డ తెలిపారు. తాను ఎన్నికల ప్రచారంలో గన్నవరంలో అక్రమ కేసులు ఉండవని ప్రకటించానని ఆ మేరకు కట్టుబడి ఉన్నానని తాను అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఒక్క అక్రమ కేసు కూడా పెట్టలేదని తేల్చి చెప్పారు. పేర్ని నాని అక్రమ కేసులు అంటూ బకాయిస్తున్న కేసులు వైసీపీ అధికారంలో ఉండగా పెట్టినవేనని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంచితే వైసీపీ నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని తెలిపారు. ఇదే అంశం పై 2019లో వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని మంత్రిగా వున్నప్పుడు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారని చెప్పారు.
టిడిపి ఆఫీస్ పై దాడి కేసు పెట్టినప్పుడు తాను ఏ పార్టీలో ఉన్నానో గుర్తులేదా అని సూటి గా ప్రశ్నించారు.
టిడిపి ఆఫీస్ పై దాడి జరిగింది నిజామా కాదా అన్న ఆయన ఈ సంఘటన జరిగినప్పుడు కనీసం మీరు ఖండించారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన భార్య పైన కేసులు పెట్టింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అన్నారు. పవన్ను, చంద్రబాబు, లోకేష్ ను నాని తరచూ విమర్శించడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని మండిపడ్డారు. మీ తండ్రి పేర్ని కృష్ణమూర్తి ఎంతో గౌరవంగా హుందాగా బతికారని ఆయన పేరు చెడగొట్టొద్దని హితవు పలికారు. పేర్ని నాని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే నాని తెలుగు భాషని అగౌరపరిస్తున్నారని వీరిద్దరూ
భాష మార్చుకోవాలని హితవు పలికారు. లోకేష్ విమర్శించే అర్హత పేర్ని కి లేదన్న యార్లగడ్డ టిసిఎస్ ద్వారా రాష్ట్రంలోని యువత కు 10 వేల ఉద్యోగాలు, కాగ్నిజెంట్ కంపెనీ నుంచి 8,000 ఉద్యోగాలు, తెచ్చి ఏరో స్పేస్ ని ఆంధ్రకు తీసుకువచ్చినందుకు లోకేష్ ని తిడుతున్నారా అని నిలదీశారు. హైదరాబాదు నుంచి ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లు ఐటి ఎగుమతులు జరుగుతున్నాయంటే అది చంద్రబాబు చలవే అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబును విమర్శించడం దారుణం అన్నారు.
నానీలిద్దరూ తెలుగు భాషను బూతులతో కూని చేస్తున్నారని మండి పడ్డారు. బూతులు మాట్లాడే నాయకులకు తెలుగు భాష నేర్పాలని సూచించారు.
విధానపరమైన విమర్శలు ఉండాలే తప్ప వ్యక్తిగత విమర్శలు ఉండకూడదన్నారు. కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా అయిదు వేల కోట్ల టర్న్వర్ ను ఎనిమిది వేల కోట్లకు తీసుకెళ్లి, రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకు బహుమానంగా తన పదవి తొలగించారని పేర్కొన్నారు.
తెలుగు భాషను బూతులతో మనుగడ కోల్పోయేలా చేస్తున్నారని
భాషను కోల్పోయిన రోజున జెంటిల్మెన్ అనరని, డాబర్మాన్ అంటారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ ఇదే భాషను వైసీపీ నాయకులు కొనసాగిస్తే పార్టీ మనగడే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here