వైసీపీ పాలనలోని అక్రమాలను బయట పెడతాం
నాగుల్ మీరా
గత వైసిపి పాలనలో జరిగిన హింస రాజకీయాలు, అధికార దుర్వినియోగం, అక్రమాలను, బయట పెడతామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు.. భవానిపురం లోని ఎన్డీయే కూటమి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తొ కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు, దాడులు , అవినీతి,తప్పుడు కేసులు పై వివరాలు సేకరిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వ 60 రోజుల పాలనలో మార్పు కనపడిందని రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పాలన కొనసాగిస్తుందని అన్నారు. అడ్డురి శ్రీరామ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నియంత పాలన కొనసాగించి పశ్చిమ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించాడన్నారు.తన అనుచరులకు, బినామీలకు, దుర్గగుడి కాళేశ్వరరావు మార్కెట్,గాంధీ హిల్ , ప్రాంతాలలో టెండర్లు వేయకుండానే అనధికారంగా కట్టబెట్టి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారన్నారు. అవినీతి, అక్రమాలు, కార్పొరేషన్ ఆదాయానికి గండి తదితర అంశాలపై విచారణ చేపడతామన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కూటమి ఎమ్మెల్యే సుజనా చౌదరి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలియజేశారు,
కార్యక్రమంలో కూటమి నాయకులు బుల్లబ్బాయి, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూష, సాయి శరత్, తదితరులు పాల్గొన్నారు