గంబుషియా చేపల ద్వారా దోమల నిర్మూలన

Spread the love

విజయవాడ నగరపాలక సంస్థ
11-11-2025

గంబుషియా చేపల ద్వారా దోమల నిర్మూలన

గంబుషియా చేపల ద్వారా దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టారు విజయవాడ నగరపాలక సంస్థ వి. కామేశ్వరరావు. మంగళవారం ఉదయం కొత్త రాజరాజేశ్వరి పేటలో నివాస ప్రదేశాలలో మధ్య పేరుకుపోయిన నీటి నిల్వలలో గంబుషియా చేపలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా బయాలజిస్ట్ కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల నిర్మూలనకు యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నారని, దోమలు పెరగకుండా ఉండేందుకు ఎంఎల్ ఆయిల్ ను కాలువల్లో స్ప్రే చేస్తున్నారని, ప్రతిరోజు ఫాగింగ్ చేపడుతున్నారని అన్నారు.

ఈ పర్యటనలో మలేరియా శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Loading