*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ *తేది.09-02-2025
గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా& ఆర్డర్ బృందాలు.
నిందితుల వద్ద నుండి సుమారు 50 వేలరూపాయల విలువైన 09 కేజీల గంజాయి స్వాదీనం
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. హరీష్ గుప్తా ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏ డి సి పి ఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ పరిదిలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా & ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదకద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా& ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ ఏరియాలో ఒక మహిళను మరియు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి 09 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుల వివరాలు
అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్.నెం 57/2025 NDPS Act కేసులో
1. విజయవాడ నందమూరి నగర్ ఏరియాకి చెందిన యోగానంద సునీత (36 సం.)
2. విజయవాడ సింగినగర్ పి&టి కాలనీ కాలనీకి చెందిన చేబ్రోలు నవీన్ బాల ప్రశాంత్ కుమార్ @ బాలు (25 సం.)
ప్రశాంత్ కుమార్ ఐటిఐ వరకు చదువుకొని బట్ట ఒక బట్టల షాపులో పనిచేస్తూ అప్పుడప్పుడు ఈవెంట్లలో ఫోటోలు తీయడానికి వెళుతుంటాడు, ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఒక ఈవెంట్ లో సునీత పరిచయమైనది, ప్రశాంత్ కు గంజాయి, మద్యం వంటి చలవ చెడు అలవాట్లు ఉండటంతో అప్పుడప్పుడు సునీత ఇంటికి వెళ్లి వాటిని సేవిస్తుంటాడు, ఈ క్రమంలో గంజాయిని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాల్లో కొనుగోలు చేసి విజయవాడ తీసుకొచ్చి విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ ఏరియాలో అక్రమంగా గంజాయి కలిగి ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు మరియు అజిత్ సింగ్ నగర్ పోలీస్ వారు వారి సిబ్బందితో కలిసి పైన తెలిపిన ఇద్దరినీ అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 9 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ కుమార్ నాగ శ్రీనివాస్ ని, అజిత్ సింగ్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ని మరియు వారి సిబ్బందిని అధికారులు అభినందించారు.
ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తుపదార్ధాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన ప్రత్యేక నెంబర్ మరియు Mail.ID ల ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్ వారికి తెలియజేయగలరు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును నెంబర్: 9121162475
Mail.ID: antinarcoticcell@vza.appolice.gov.in