క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పశ్చిమ లోని క్రీడాకారులకు సంబంధించి ఏ సమస్య తన దృష్టికి తీసుకొచ్చిన

Spread the love

 క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం.

సుజనా చౌదరి 

క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పశ్చిమ లోని క్రీడాకారులకు సంబంధించి ఏ సమస్య తన దృష్టికి తీసుకొచ్చిన పరిష్కరిస్తానని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ(సుజనా చౌదరి) తెలిపారు. బుధవారం 46 వ డివిజన్ కె ఎల్ రావు పార్కులోని ఇండోర్ స్టేడియాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ నియోజవర్గంలోని స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, అభివృద్ధికి  కట్టుబడి ఉన్నామన్నారు.మన క్రీడాకారులు జాతీయస్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన స్టేడియం తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషమన్నారు. షటిల్, బ్యాడ్మింటన్, క్రీడలకు సౌకర్యవంతంగా ఉండేలా ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని క్రీడా ప్రాంగణాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజి చైర్మన్ నాగుల్ మీరా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, టిడిపి కార్యనిర్వాహ కార్యదర్శి ఎంఎస్ బేగ్, టిడిపి మాజీ ఉపాధ్యక్షులు గుర్రంకొండ, డివిజన్ ప్రెసిడెంట్ డిటి ప్రభుదాస్,  బిజెపి నాయకులు శివకుమార్ పట్నాయక్, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *