కొనకళ్ల నారాయణరావు అభినందన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి.

Spread the love

 కొనకళ్ల నారాయణరావు అభినందన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి.

మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు ఏపీఎస్, ఆర్టీసీ చైర్మన్ గా శనివారం బాధ్యతలు స్వీకరించారు.అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పాల్గొని కొనకళ్ళకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుజనా మాట్లాడుతూ ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో ఉన్న కొనకళ్ళ నారాయణరావు ఆశయాలు, ఆలోచనలు, నేటి తరానికి స్ఫూర్తినిస్తాయన్నారు. మొదటి లిస్టులోనే నామినేటెడ్ పదవికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలలో అనేక మెలకువలు కొనకళ్ళ దగ్గరనుంచి నేర్చుకున్నామన్నారు. కొనకళ్ళ తమ రాజకీయ గురువు అని సుజనా కొనియాడారు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారని పదిమందికి సహాయపడే వ్యక్తిత్వం కొనకళ్ళదన్నారు. ఆయన మార్గదర్శకంలో ఏపీఎస్ ,ఆర్టీసీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని సుజనా ఆకాంక్షించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *