కొత్త రూపంలో అంబులెన్సులు
త్వరలోనే సాధారణ తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులతో, రిఫ్లెక్టివ్ టేపులతో కూడిన అంబులెన్స్లు రయ్ రయ్మని దూసుకుపోనున్నాయి. వైకాపా సర్కార్ వేసిన నీలం రంగును తొలగించి, అత్యాధునిక సాంకేతిక పరికరాలు అమర్చిన సరికొత్త అంబులెన్స్లను వీలైనంత త్వరలో కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలోని కుశలవ కోచ్లో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంజీవని పేరుతో తీసుకొస్తున్న 104 వాహనంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఫొటోలను ముద్రిస్తున్నారు.