విజయవాడ నగరపాలక సంస్థ
14-06-2025
కేబుల్, ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు, ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే, వాటిని వెంటనే తొలగించండి
అవసరంలేని, వాడని వైర్లను క్రమబద్ధీకరించి, ఒక వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశాలు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర పౌరుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటూ, నగర సుందరీకరణలో భాగంగా అవసరం లేని వాడని కేబుల్ ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.
నగర పరిధిలో ఎక్కడైనా వేలాడుతూ ఉన్న కేబుల్, ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు, ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే, వాటిని వెంటనే తొలగించి, అందంగా ఉండేలా పునర్నిర్మించుకోవాలని ఆదేశించారు. అవసరంలేని, వాడని వైర్లను క్రమబద్ధీకరించి, ఒక వారం రోజుల్లోగా తొలగించాలని, ఈ నిబంధనకు అమలు చేయకపోతే, వారం తర్వాత నగరపాలక సంస్థ అధికారులు స్వయంగా రంగంలోకి దిగి, తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. పౌరులు, కేబుల్ ఆపరేటర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, సమర్థవంతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగర సుందరీకరణలో భాగస్వాములు కావాలని కోరారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ