కేబీఎన్ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 సాంకేతిక పరిజ్ఞానంతో

విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు 

కేబీఎన్ కాలేజీలో

 కంప్యూటర్ ల్యాబ్

ప్రారంభించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ పశ్చిమ, జులై 15:-

విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగైన ఉపాధి తద్వారా మంచి భవిష్యత్తు పొందుతారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం లోని కేబీఎన్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను 

ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పొందడం ద్వారా వారి భవిష్యత్తుకు మేలు చేసిన వారు అవుతారని తెలియజేశారు. ఆధునిక కాలంలో కంప్యూటర్ జీవిత అవసరాల్లో ఒక భాగం అయిందన్నారు.విద్యార్థులు ఈ కంప్యూటర్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో కె బి ఎన్ కళాశాల ప్రిన్సిపల్ 

నారాయణరావు, కాలేజీ సిబ్బంది విద్యార్థులు, 

ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,

తెలుగుదేశం పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు,ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *