కేఎల్ రావు నగర్ లో త్రాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 కేఎల్ రావు నగర్ లో త్రాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ పశ్చిమ, జూలై 10.

పశ్చిమ నియోజకవర్గంలో 

అన్ని ప్రాంతాల్లో త్రాగు నీటి సమస్య లేకుండా చూడాలని కార్పొరేషన్ అధికారులకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా తమకు త్రాగు నీరు 

సమస్యతో కొట్టుమిట్టాడుతున్నామని 

తమకు త్రాగునీరు అందించే విధంగా చేయాలని కోరుతూ 

కె ఎల్ రావు నగర్

 ప్రాంత వాసులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

దృష్టికి తీసుకువెళ్లారు.

అసలు త్రాగునీరు సమస్య ఎందుకు వచ్చిందననీ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియజేయాలని సుజనా చౌదరి కార్పొరేషన్ త్రాగునీరు సరఫరాకు సంబంధించిన అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. 

కేఎల్ రావు నగర్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా త్రాగునీరు అందక ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక టిడిపి డివిజన్ ప్రధాన కార్యదర్శి మక్కెన భాస్కర్ కుమార్, నమ్మి భాను ప్రకాష్ యాదవ్ కు 

తెలియచేయగా వారు 

తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఎస్ బేగ్ కు వివరించగా ఎన్డీఏ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు సమస్య తెలియజేశారు.

కే యల్ రావు నగర్ ప్రాంతపు ఏఈ రాజేష్ కు వెంటనే సమస్య పరిష్కరించాలని సూచించారు. కె ఎల్ రావు ప్రాంతంలో ప్రాంతంలో త్రాగునీటి సమస్య పరిష్కరించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *