కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ విజయవాడ శ్రీ దుర్గమ్మ దర్శనం – రాష్ట్ర అభివృద్ధికి సంకల్పం

2
0

తేదీ: 02 ఆగస్టు 2025
కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ విజయవాడ శ్రీ దుర్గమ్మ దర్శనం – రాష్ట్ర అభివృద్ధికి సంకల్పం

కేంద్ర రవాణా, ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆయన అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. గడ్కరీకి ఆలయ ఈవో వి.కె.సీనా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీస్సులు అందించగా, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో… సర్వశ్రీ సి.ఎం. రమేష్, ఎంపీ, బాపట్ల ఎంపీ టీ.కృష్ణ ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి, బి.సి. జనార్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి (రోడ్లు & భవనాలు మరియు మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు) • ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు పి.మాధవ్, • తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ • ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here