కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ సెమినార్ సదస్సులో భాగంగా విజయవాడ విచ్చేసిన కేంద్ర సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి గన్నవరం ఎయిర్ పోర్టులో మర్యాదపూర్వకంగా కలిశారు.
పశ్చిమ లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు విచ్చేశారు. అదే సమయంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు రావడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరివారిని కలిసి కాసేపు ముచ్చటించారు..
ప్రమాద గాయం నుంచి కోలుకున్న సుజనా చౌదరి ను గజేంద్ర సింగ్ షెకావత్, రఘురామ రాజు పరామర్శించారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు