కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

4
0

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువభారత్
( మై భారత్) ఆధ్వర్యంలో శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అవగాహన సదస్సు వర్క్ షాప్ నిర్వహించారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మై భారత్ ఎన్టీఆర్ జిల్లా యువ అధికారి సుంకర రాము, విజయవాడ ఆకాశవాణి రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ హెన్రీ రాజ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ మేనేజర్ ఎస్ శ్రీనివాసరావు, దూరదర్శన్ ఎడిటర్ పురుషోత్తం రెడ్డి, భవానిపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సత్యనారాయణ, భవానిపురం యూనియన్ బ్యాంక్ మేనేజర్ సుజన ముఖ్య అతిథులుగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకి అవగాహన కల్పించారు

పథకాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి

ఎన్టీఆర్ జిల్లా యువ అధికారి
సుంకర రాము

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల అందరికీ అవగాహన ఉండాలని ముఖ్యంగా యువత క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేశంలోని పేద,మధ్యతరగతి వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనె లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం
వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అవగాహన కల్పిస్తుందన్నారు..
ప్రధాని మోడీ సంకల్పం, కృషి ద్వారా 140కి పైగా పథకాలను విజయవంతంగా అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఆకాశవాణి రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ హెన్రీ రాజ్

2029 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేలా ప్రధాని మోడీ అనేక పథకాలకు శ్రీకారం చుట్టారని ఆకాశవాణి రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ హెన్రీ రాజ్ అన్నారు..
భారత్‌ను ప్రపంచంలో నెంబర్‌ వన్‌గా నిలపాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం ఒక్కొక్కటిగా నెరవేరుతోందని మేడిన్‌ ఇండియా పథకంలో భాగంగా అన్ని రంగాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయన్నారు
ఈ క్రమంలోనే చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు
హస్తకళాకారుల సంప్రదాయ నైపుణ్యాల సాధనను ప్రోత్సహించడంలో, బలోపేతం చేయడంలో నైపుణ్య శిక్షణ, లబ్దిదారునికి ఆర్థికస్వాలంభన సాధించేలా ఈ పథకాన్ని రూపొందించారన్నారు
కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, స్వర్ణకారులు తదితర చేతివృత్తుల వారు మరుగున పడకుండా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడానికి ప్రధాని మోడీ ప్రారంభించిన విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆర్థికంగా బలోపేతం చేయాలి దూరదర్శన్ ఎడిటర్
పురుషోత్తమ రెడ్డి

దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని యువత బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.. 145 కోట్ల జనాభాలో 40 శాతం యువత నైపుణ్యాలను పెంపొందించుకొని సవాళ్లను అధిగమించాలన్నారు పట్టణాలతోపాటు, గ్రామీణ ప్రాంతంలో కూడా పథకాల గురించి అవగాహన కల్పించి
ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు.

యువత పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సత్యనారాయణ

నేటి ఆధునిక యువత ఉద్యోగ కల్పన ధ్యేయంగా పరుగులు పెడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా రాణించాలన్నారు .
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్
( పీ ఎం ఈ జీ పీ) కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులు సబ్సిడీని పొందవచ్చు అన్నారు.
స్వయం ఉపాధి రంగాలకు, కుటీర చిన్న మధ్య తరహా పరిశ్రమల వాళ్ళు ఎంటర్ప్రైన్యూర్ లుగా ఎదిగే వాళ్ళు ముద్ర లోన్స్, మరియు
( పీ ఎం ఈ జీ పీ) పథకాల ద్వారా ఆర్థిక సాయం పొంది పారిశ్రామికవేత్తలుగా రాణించాలన్నారు..
ఈ కార్యక్రమానంతరం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ వర్క్ షాప్ లో పాల్గొన్న అతిధులను సన్మానించి మేమోంటోలను అందజేశారు.
వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక ప్రజలు, పలు కళాశాల విద్యార్థులు , సుజనా ఫౌండేషన్ సిబ్బంది ,సుజనా మిత్ర కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రియాజ్ సుల్తానా, చింతా సృజన్ ( బాబీ) మంతెన తరుణ్ , కసుకుర్తి రాజేష్,మోహన లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here