Home Andhra Pradesh కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

6
0

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలైన పోస్టల్ బీమా పథకాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఫైనాన్షియల్ డిజిటల్ సేవలు, యువత ఉపాధి కోసం
డిజిటల్ మార్కెటింగ్,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
ల్యాండ్ సర్వేయర్, జూనియర్ స్మార్ట్ మీటర్స్ వంటి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి , ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,విజయవాడ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎస్ రవి కిషోర్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ పీ నాగలక్ష్మి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కే అనుదీప్, ఐపీ పీ బి సీనియర్ మేనేజర్ శ్రావణ్ కుమార్, సీడాప్ జే. డీ. ఎం
బీ సుమలత ,నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ట్రైనర్ ఇంచార్జ్ ఎస్ సైదులు నాయక్ , కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజర్ శ్రీకాంత్,ఎమ్మెల్యే కార్యాలయ వెల్ఫేర్ ఆఫీసర్ రియాజ్ సుల్తానా పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

బ్యాంకులకు దిటుగా పోస్టల్ సేవలు
అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎస్ రవి కిషోర్

అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎస్ రవి కిషోర్ మాట్లాడుతూ బ్యాంకులకు దీటుగా వినియోగదారులకు పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్థిక లావాదేవీలు పోస్టల్ సేవల ద్వారా సులభమైన ఆధునిక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు , పోస్టల్ సేవలు , డిజిటల్ అకౌంట్ల పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బేసిక్ సేవింగ్ అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అందిస్తున్న వివిధ రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఆర్థిక వ్యవస్థలో ఐ .పీ.పీ .బీ ప్రధాన పాత్ర పోషిస్తుంది
ఐ .పీ.పీ .బీ బ్రాంచ్ మేనేజర్
కే అనుదీప్

ఐ .పీ.పీ .బీ బ్రాంచ్ మేనేజర్
కే అనుదీప్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు.2018 లో ప్రధాని మోడీ ప్రారంభించిన ఐ .పీ .పీ .బీ దేశవ్యాప్తంగా 12 కోట్ల ఖాతాలు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50 లక్షల ఖాతాలను కలిగి ఉందన్నారు. పూర్తిస్థాయి బ్యాంకులు గా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి రావడానికి ఎన్. పి సీ. ఐ ద్వారా ఖచ్చితమైన సేవలను అందిస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలు, ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లో భాగస్వామ్యులై ,సద్వినియోగం చేసుకోవాలని అనుదీప్ కోరారు

ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏపీ ట్రైనర్ ఇంచార్జ్ ఎస్ సైదులు నాయక్

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏపీ ట్రైనర్ ఇంచార్జ్ ఎస్ సైదులు నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మెరుగు పరిచి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ లో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో యువతను, నిరుద్యోగులను భాగస్వామ్యులను చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సుజనా చొరవతో ఏపీలో మొదటిసారిగా పశ్చిమ లో స్మార్ట్ మీటర్ల పై శిక్షణనిస్తున్నామని తెలిపారు.డిజిటల్ మార్కెటింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాండ్ సర్వేయర్, జూనియర్ స్మార్ట్ మీటర్స్ లో శిక్షణ,మహిళల కోసం బ్యూటీ పార్లర్, టైలరింగ్ తదితర కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని నిరుద్యోగ ఎస్సీ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ లోని ఆర్పీలు, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here