కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమైన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఆర్థిక సహాయం గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామమోహన్ నాయుడు ఉన్నారు.