కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ

4
0

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ 

ఏపీ సిఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా దిల్లీ చేరుకున్నారు. 

శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్ లోని ఆర్థికశాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు.

సుమారు 45 నిమిషాలపాటు కొనసాగిన ఈ భేటీలో.. రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. 

ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. 

అనంతరం ముఖ్యమంత్రి.. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీలనూ సీఎం కలిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here