Home Andhra Pradesh కెనోయ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతక విజేత గొలుగూరి వర్షితను అభినందించిన నగర...

కెనోయ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతక విజేత గొలుగూరి వర్షితను అభినందించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజా శేఖరా బాబు

4
0

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేదీ. 29-05-2025.కెనోయ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతక విజేత గొలుగూరి వర్షితను అభినందించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజా శేఖరా బాబు ఐ.పి.ఎస్. గత నెల 24 నుంచి 28 వరకు బోపాల్ లోని లోయర్ లేక్ వేదికగా జరిగిన 35వ జాతీయ కెనోయ్ స్ప్రింట్ చాంపియన్ షిప్ లో కంస్య పతకం సాధించిన అథ్లెటిక్ గొలుగూరి వర్షితను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అభినందించారు పడమట ఎన్ ఎస్ ఎం పబ్లిక్ స్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్నట్లు, కెనోయ్ ఈవెంట్ లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుండి వర్షిత ఒక్కర్తే ఎంపిక అయినట్లు, బోపాల్ నందు జరిగిన 35వ జాతీయ కెనోయ్ స్ప్రింట్ చాంపియన్ షిప్ లో సబ్ జూనియర్ కె4 500మీ. ల విభాగంలో ఒడిశా జట్టుకు ప్రాతినిధ్య వహించి తృతీయ స్థానం సాధించినట్లు వివరించగా, వర్షిత చదువుల్లో, అథ్లెటిగ్గా రాణించి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్. ఆకాంక్షించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here